సారథి న్యూస్, తాడ్వాయి: సంఘవిద్రోహ శక్తులు, వివిధ నిషేధిత విప్లవ పార్టీ గ్రూపులకు సహకరించవద్దని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలోని రాపట్ల గుత్తికోయగూడెంలో పోలీసు బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటిని క్షుణ్ణంగా తనిఖీచేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? లేదా? అనే కోణంలో సోదాలు జరిపారు. అనంతరం గొత్తికోయ ఆదివాసీలందరిని ఒకచోట సమావేశపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. ఏ సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్లో తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. వారి జీవన పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొత్తికోయ గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు.
- February 2, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- CARDENSEARCH
- GUTHIKOYA
- MULUGU
- TADWAI
- కార్డెన్ సెర్చ్
- గుత్తికోయలు
- తాడ్వాయి
- ములుగు
- Comments Off on సంఘ విద్రోహశక్తులకు సహకరించొద్దు