- కొట్లాడి సాధించుకుందాం
- ఓయూ విద్యార్థులతో ముఖాముఖి
- బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ప్రవీణ్కుమార్
సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఆచార్యులతో కళకళలాడాల్సిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఖాళీలతో వెలవెలబోతున్నాయని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎంతోమంది యువత తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల కోసం బలిదానం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమన్నారు. బుధవారం ఆయన ఓయూ సెంట్రల్లైబ్రరీని సందర్శించిన అనంతరం విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఏళ్ల తరబడి ఆచార్యుల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో బోధన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను తొలగించి తీరని అన్యాయం చేసిందన్నారు. బీఎస్పీ ఎప్పుడు అండగా ఉంటుందని, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చకూడదని సూచించారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు అడిగిన సమకాలీన రాజకీయ అంశాలపై డాక్టర్ఆర్ఎస్తనదైన శైలిలో స్పందించారు. ఆయన వెంట బీఎస్పీ, ఎస్ఎస్యూ చౌటి ప్రభాకర్నాయకులు ఉన్నారు.