సారథి, హుస్నాబాద్: మాస్కు లేకుండా బయటకు రావొద్దని హుస్నాబాద్ ఏసీపీ సందెపోగు మహేందర్ సూచించారు. బస్టాండ్, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మాస్కులు లేకుండా డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కండక్టర్లు, బస్టాండ్ ఆవరణతో పాటు రోడ్లపై తీరుగుతున్న వ్యక్తులకు మాస్కులను పెట్టి వాటి అవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు ఎస్.శ్రీధర్, కె.రవి, ఆర్టీసీ కార్మికులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- April 2, 2021
- Archive
- మెదక్
- ACP MAHENDAR
- HUSNABAD
- SIDDIPETA
- ఏసీపీ మహేందర్
- సిద్దిపేట
- హుస్నాబాద్
- Comments Off on మాస్కు లేకుండా బయటికి రావొద్దు