సారథి, రామడుగు: మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి –మనోహరాబాద్ రైల్వే లైన్ భూ బాధితులకు న్యాయం చేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్ రెడ్డి గ్రామ భునిర్వాసితులతో కలసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ లో భూములు, ఇండ్లను కోల్పోయి ఆ రైల్వే లైన్ పక్కనే భూమి కొనుగోలుచేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ మనోహరాబాద్ రైల్వే జంక్షన్ లో భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎల్కపెల్లి లచ్చయ్య, కొమురయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.
- April 5, 2021
- Archive
- CHOPPADANDI
- kothapally-manuhabad
- MLA SUNKE RAVISHANKAR
- RAMDUGU
- కొత్తపల్లి –మనోహరాబాద్ రైల్వే లైన్
- చొప్పదండి ఎమ్మెల్యే
- దేశరాజుపల్లి
- రామడుగు
- సుంకే రవిశంకర్
- Comments Off on నిర్వాసితులకు న్యాయం చేయండి