సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూ్ల్ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన విద్యావలంటీర్లకు 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు పంపిణీ చేశారు. విద్యావలంటీర్లు కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతుంటే.. పాలకులు మాత్రం అక్రమంగా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని విమర్శించారు. విద్యావలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర, మండలాల అధ్యక్షులు సాయికృష్ణగౌడ్, అన్వేష్, సత్యనారాయణ గౌడ్, మండల ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాస్ యాదవ్, ఒరే శేఖర్, ఎల్లయ్య యాదవ్, కొల్లాపూర్ మండలాధ్యక్షుడు గంగం మల్లేష్ యాదవ్, చందుయాదవ్, పానుగల్ మండల దళితమోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, జగదీశ్ పాల్గొన్నారు.
- June 18, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BJP
- KOLLAPUR
- vidyavoluteer
- కొల్లాపూర్
- బీజేపీ
- విద్యావలంటీర్లు
- Comments Off on విద్యావలంటీర్లకు సరుకులు పంపిణీ