సారథి, చొప్పదండి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సంజయ్ సురక్ష అనే పేరుతో వైద్యపరికరాలను బుధవారం ఆ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎవరికీ ఏ సహాయం కావాలన్నా బండి సంజయ్ ముందుంటున్నారని కొనియాడారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఝాన్సీ మాట్లాడుతూ హాస్పిటల్ కు వైద్యపరికరాలను అందజేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రాజన్నల రాజు, మండలాధ్యక్షుడు మావురం సుదర్శన్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శులు బత్తిని ప్రశాంత్, గుండేటి వెంకటరమణ, నాయకులు బైరగొని కిట్టుగౌడ్, సాయికృష్ణ, పి.నర్సింహారెడ్డి, జోంగోని తిరుపతిగౌడ్, నామ వేణుగోపాల్ రావు, మంచికట్ల మల్లేశ్, గుర్రం సమర్, తాడూరి రామక్రిష్ణ, తాడూరి శివకృష్ణ, పెద్ది విరేశం, లింగంపెల్లి కళ్యాణ్, సాయి గణేష్, చిల్ల శ్రావణ్, రాజన్నల తిరుపతి, కాయిత సాయి, శ్రీగాధ సాగర్, పొన్నాల రాజేశ్ పాల్గొన్నారు.
- August 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- KARIMNAGAR
- sanjay suraksha
- కరీంనగర్
- చొప్పదండి
- బండి సంజయ్
- సంజయ్ సురక్ష
- Comments Off on ఆస్పత్రికి ‘సంజయ్ సురక్ష’ వైద్యపరికరాలు పంపిణీ