సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ చేసినట్లు సిద్దిపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రోడ్డున పడడంతో సీఎం కేసీఆర్ రూ.రెండువేల నగదు వారి బ్యాంక్ అకౌంట్ లో వేయడమే కాకుండా, 25 కేజీల సన్నబియ్యాన్ని పంపిణీ చేసి, ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్లు స్వర్ణలత, సరోజన, రత్నమాల, సుప్రజ, భాగ్యరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు శంకర్ రెడ్డి, ఎండీ ఆయూబ్, ప్రైవేట్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
- April 23, 2021
- Archive
- CM KCR
- HUSNABAD
- SIDDIPET
- TELANGANA
- తెలంగాణ
- సిద్దిపేట
- సీఎం కేసీఆర్
- హుస్నాబాద్
- Comments Off on ప్రైవేట్ టీచర్లకు బియ్యం పంపిణీ