Breaking News

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

హమాలీలు, కూలీలకు మాస్కులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామ పంచాయతీలో ఎంపీపీ చిలుక రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, వరి కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీలకు ఐదొందల మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నదని, ప్రజలంతా మాస్కులు ధరించి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.

భౌతికదూరం పాటించాలి. గ్రామంలో ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ఎవరికివారు తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. వరలక్ష్మి మహిళా స్వశక్తి సంఘం నుంచి మాస్కులు తయారుచేయించి చుట్టుపక్కల గ్రామాలకు పంపిణీ చేస్తున్న సిరిపురం వనిత లక్ష్మీకాంత్ ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుక లింగయ్య, ఉపసర్పంచ్ ముద్దసాని చిరంజీవి, వీవోలు మంగ, లంక కవిత, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, గ్రామ ప్రముఖులు పత్తిపాక నరేష్, ముద్దసాని రాజయ్య, సిరిపురం లక్ష్మీకాంత్, ఒడ్డె మల్లయ్య, కారోబార్ సలీం, ఉపాధి హామీ మేటీ లంక రాజేందర్ పాల్గొన్నారు.