సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొంతమంది కరోనా బాధితులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వారికి నిత్యవసర సరుకులను కల్వకుంట సహకార సంఘం చైర్మన్ అందె కొండల్ రెడ్డి అందంజేశారు. ఈ మేరకు ఆయన బాధితులకు మనోధైర్యాన్ని నింపి, వారికి ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు. పంపిణీలో మండల మాజీ మార్కెట్ డైరెక్టర్ నాగరాజు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు లచ్చపేట్ రామగౌడ్, కల్వకుంట గ్రామ టీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు రాము, కార్తీక్ పాల్గొన్నారు.
- May 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on కరోనా బాధితులకు సరుకులు పంపిణీ