Breaking News

అద్దాల పంపిణీ

అద్దాల పంపిణీ

సామాజిక సారథి, ఇల్లంతకుంట:  రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్  గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మీర్ పేట్  గుర్రాల ముత్యం రెడ్డి గారి ఆద్వర్యంలో ఎంఎస్రెడ్డి లయన్స్ నేత్ర వైద్యశాల వారిచే గత వారం రోజుల నుండి ఈ రోజు వరకు  ఉచిత కంటి పరీక్ష ,ఆపరేషన్ 143మందికి , కంటి అద్దాలు 180 మంది కి పంపిణీ చేశారు.అనంతరం జిల్లా  పరిషత్  హై స్కూల్ లో 6వ చదువుతున్న వెగ్గళం స్వాతి నిరుపేద విద్యార్థినికి చదువుకొరకు నెల నెల వారిగా రూ. 1500, లయన్స్ క్లబ్ సభ్యులు గుడిగంటల రాములు గౌడ్ రూ. 1000, కృష్ణ ప్రసాద్ రూ. 500 అందజేశారు. అనంతరం స్కూల్ కంప్య్యూటర్ లు పాడవగా అవి కూడా బాగు చేసి ఇస్తామని హమీ ఇచ్చినారు. కార్యక్రమంలో సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్, ఎంపీటీసీ కరివెద స్వప్న కర్ణాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొల్ల మల్లారెడ్డి, మీడియా సెల్ ఇంచార్జ్ మీసరగండ్ల అనిల్ కుమార్, గన్నేరపు నర్సయ్య,లయన్స్ క్లబ్ మీర్ పేట సభ్యులు ఆర్సీ సుకెందర్ రెడ్డి గారు,  జెడ్ సి హస్పిటల్ చైర్మేన్ ముణిరత్నం ప్రెసిడెంట్ మోగిళి గౌడ్, సెక్రెటరీ నర్ర జగదీశ్వర్ రెడ్డి, ట్రెజరర్ సూర్యప్రకాశ్, డోనర్ గుర్రాల ముత్యం రెడ్డి, హస్పిటల్ వైస్ చైర్మన్ చింతల రామచెందర్ , ప్రధానోపాధ్యాయులు చింతపెల్లి వెంకటేశ్వర్ రావు, కేతిరెడ్డి సునిత, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.