సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులకు మధ్య సమన్వయలోపం కారణంగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గజగట్లపల్లి గ్రామంలో వడ్లు నింపిన బస్తాలు కాలుపై పడి హమాలికి గాయమైనప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్తు ప్రకాష్, రైతులు పాల్గొన్నారు.
- June 5, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- bjp kisan morcha
- CHINNASHANKARAMPET
- medak
- చిన్నశంకరంపేట
- ధాన్యం కొనుగోళ్లు
- బీజేపీ కిసాన్ మోర్చా
- మెదక్
- Comments Off on ముందుచూపు లేకే రైతులకు ఇబ్బందులు