నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
సారథి, పెద్దశంకరంపేట: పల్లె ప్రగతి పనులతో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అందుకోసం ప్రజలంతా సమష్టిగా కృషిచేయాలని కోరారు. ఆదివారం ఆయన మెదక్జిల్లా పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో మహిళా సంఘాల సభ్యులకు మొక్కలు అందజేశారు. ప్రతిఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పిచ్చిమొక్కలను తొలగించడం, మురికి కాల్వలను శుభ్రంచేయడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరచడం వంటి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ డీఎల్ పీవో సుధాకర్ రెడ్డి, ఎంపీపీ జనగం శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యుడు విజయరామరాజు, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణాసుభాష్ గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, ఎంపీడీవో రాంనారాయణ, ఐకేపీ ఏపీఎం గోపాల్, ఈవో విఠల్, నాయకులు మాణిక్యరెడ్డి, వెంకట్ రెడ్డి, మహిళా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.