చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పల్లెప్రగతి ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. గురువారం కాట్నపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చదనం, పారిశుద్ధ్యం పల్లెప్రగతి ముఖ్య లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటికల నిర్మించుకున్నామని చెప్పారు. తల్లిదండ్రుల చనిపోయి అనాథలుగా మారిన సమత, మమతకు దాతల నుంచి రూ.16లక్షలను వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. వారి ఇంటి నిర్మాణాన్ని ముగ్గుపోసి ప్రారంభించారు. ఆ చిన్నారులకు నూతన వస్త్రాలు అందజేసి వారితో కలిసి ఎమ్మెల్యే రవిశంకర్భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, పాక్స్ చైర్మన్ వెలమ మల్లారెడ్డి, సర్పంచ్ లావణ్య, పలువురు టీఆర్‌ఎస్‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పచ్చదనంతో భాసిల్లాలి
చొప్పదండి పట్టణంలో 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చొప్పదండి పట్టణం పచ్చదనం, పరిశుభ్రతతో భాసిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. పట్టణాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. చొప్పదండిలో రూ.ఐదుకోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించామని, అవి తుదిదశకు చేరాయని తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్చంద్రశేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు మహేష్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.