సామాజికసారథి, బిజినేపల్లి: మండలంలోని వస్రముతండా గ్రామపంచాయతీకి చెందిన అలుగుతండాలో గుర్తుతెలియని దుండగులు ఆదివారం తెల్లవారుజామున కాంగ్రెస్ దిమ్మెను కూల్చివేశారు. దిమ్మెను చూసి అలుగుతండాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఎన్నికల సమయంలో ప్రశాంతవంతమైన వాతావరణంలో ఉన్న గ్రామాల్లో కొందరు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. చిల్లరచేష్టలను మానుకోవాలని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. జరిగిన సంఘటన తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు తండాకు భారీగా చేరుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
- October 15, 2023
- Archive
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on కాంగ్రెస్ దిమ్మె కూల్చివేత