Breaking News

పేదలకు సరుకులు పంపిణీ

సరుకులు పంపిణీ

సారథి, చొప్పదండి: కరోనా విజృంభణ.. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో పేద కుటుంబాలకు సోమవారం టీఆర్ఎస్ నాయకులు మచ్చ రమేష్, మిత్రుల సహకారంతో 25కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రవి, తాల్లపల్లి కరుణాకర్, దూస మురళి, దూస సతీష్, ఎనగందుల సాయికుమార్, తమ్మడి సంతోష్ పాల్గొన్నారు.