- ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
సామాజిక సారథి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఉద్యమ చరిత్రలో డిసెంబర్ 9వ తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన రోజు. ఉద్యమ నాయకుడు, నేటి మన సీఎం కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి, స్వరాష్ట్ర సాధనకు నాంది పలికిన రోజు” అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటితో 12ఏళ్లు పూర్తయిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఒక దీక్ష.. ఒక విజయం.. ఒక యాది..’ శీర్షికన కథనం రాసిన మీడియా అకాడమీ డైరెక్టర్ అల్లం నారాయణకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.