సారథి న్యూస్, చిన్నశంకరంపేట: బ్యాంకుల నుంచి తీసుకున్న స్త్రీనిధి రుణాలను సకాలంలో చెల్లించాలని డీఆర్డీఏ అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి భీమయ్య సూచించారు. మంగళవారం మెదక్జిల్లా చిన్నశంకరంపేట మండల సమాఖ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రతి సంఘం సమావేశాలు నిర్వహించుకోవడం, పొదుపు చేయడం, అంతర్గత అప్పులు ఉండడం, తిరిగి చెల్లింపులు చేయడం, పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండటం వంటి పంచసూత్రాలు పాటించాలని సూచించారు. కుటుంబ జీవనోపాధి ప్రణాళిక ప్రకారమే రుణాలు పొంది ఆదాయభివృద్ధి కార్యక్రమాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం పొందాలన్నారు. అంతకుముందు చెన్నాయిపల్లిలో సంఘం సభ్యులతో కుటుంబ జీవనోపాధి ప్రణాళికలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీఎం వెంకటస్వామి, సీసీలు యశోద, యాదగిరి, కిషన్, అకౌంటెంట్ ధనలక్ష్మి, మండలంలోని ఆయా గ్రామాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
- February 16, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHINNASHANKARAMPET
- DRDA
- medak
- SELFHELF GROUP
- చిన్నశంకరంపేట
- మెదక్
- స్త్రీనిధి
- Comments Off on రుణాలను సకాలంలో చెల్లించాలి