Breaking News

‘అప్పుల తెలంగాణగా మార్చారు’

‘అప్పుల తెలంగాణగా మార్చారు’

సారథి, నర్సాపూర్: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్ కే దక్కిందని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని మెదక్​జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సింగయపల్లి గోపి, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బీజేవైఎం నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా పిలుపుమేరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. యువత ఐకమత్యంగా ఉన్నారని, ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టంచేశారు. నిరుద్యోగ భృతి చెల్లించకుండా ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదని, అప్పులపాలు చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తే భవిష్యత్​ఉంటుందన్నారు. అనంతరం నర్సాపూర్​తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాల్దాస్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు రఘువీర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, బీజేపీ కౌన్సిలర్లు భుచ్చేష్ యాదవ్, బాల్ రెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ర్యాలీని ప్రారంభిస్తున్న బీజేపీ నాయకులు