సారథి న్యూస్, వెంకటాపురం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని కుమ్మరివీధికి చెందిన పూసం యశ్వంత్(20) అనే యువకుడి డెడ్‌బాడీ గురువారం పాలెం ప్రాజెక్టులో లభ్యమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూసం యశ్వంత్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో వారంతా వేరే బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించి ఆరా తీయలేదు. రెండురోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పూసం యస్వంత్ మృతదేహం పాలెం ప్రాజెక్టులో దొరికింది. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- February 18, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- MULUGU
- PALEM PROJECT
- VENKATPURAM
- పాలెం
- ములుగు
- వెంకటాపురం
- Comments Off on పాలెం ప్రాజెక్టులో యువకుడి డెడ్‌బాడీ