సారథి, బిజినేపల్లి: నిరంతరం పేదవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్ప్రకటించిన దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామశాఖ మహాసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గాలు ప్రజాసంక్షేమాన్ని మర్చిపోయి, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో సామాన్యుల జీవన ప్రమాణాలు తగ్గితే పెట్టుబడిదారుల ఆస్తులు పెరిగాయని అన్నారు. పాలకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల సంక్షేమం గుర్తుకొస్తుందే తప్ప మిగతా సమయంలో వారి ధ్యాసే ఉండదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు చంద్రశేఖర్, హనుమంతు, శుభాకర్, మల్లేష్, రమేష్, గంగాధర్, మహేష్ పాల్గొన్నారు.
- August 1, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- CM KCR
- CPM
- దళితబంధు
- బిజినేపల్లి
- సీఎం కేసీఆర్
- సీపీఎం
- Comments Off on రాష్ట్రమంతటా దళితబంధు