సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు తాండ్రల తిరుపతి మాదిగ, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ సుంకపాక దామోదర్ మాదిగ, వీఎచ్ పీఎస్ జిల్లా కోకన్వీనర్ తలారి సురేష్, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జ్ ఎడపల్లి నాగరాజు, ఎడపెల్లి నర్సవ్వ, మంకు లచ్చవ్వ, శాంతవ్వ, మల్లారం స్వప్న, నమిలికొండ నర్సవ్వ, జయ, జమున, దీక్షలో కూర్చున్నారు. వారికి వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ మద్దతు తెలిపారు.
- August 11, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- dalithabandu
- MRPS
- VEMULAWADA
- ఎమ్మార్పీఎస్
- దళితబంధు
- వేములవాడ
- Comments Off on రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి