Breaking News

ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

ఆధునికత వైపు ‘సాగు’తున్నారు..

  • వ్యవసాయంలో నూతన పద్ధతులు
  • పెరిగిన యంత్ర పరికరాల వాడకం

సారథి, రామడుగు: సంప్రదాయ సాగును వదిలి రైతులు ఆధునికత వైపునకు అడుగులు వేస్తున్నారు. కొత్త కొత్త పరికరాలతో వ్యవసాయ పనులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అటు కూలీల కొరత తగ్గించుకోవడంతో పాటు ఇటు అధిక దిగుబడిని సాధిస్తూ లాభాల వైపు సాగుతున్నారు. నాట్లు వేసే యంత్రంతో కొందరు, వెదజల్లే పద్ధతిలో ఇంకొందరు, డ్రమ్ సీడర్ తో మరికొందరు.. ఇలా వరి సాగు పనులు చేపడుతున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కోస్న వెంకట్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో డ్రమ్ ​సీడర్ తో ఆదివారం వరిసాగును ప్రారంభించారు. నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు కలుపు నివారణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సదరు రైతు చెప్పాడు. ఈ విధానం ద్వారా పంట దిగుబడి సాధారణ సాగు కంటే అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోరైతు రాగం లచ్చయ్య తన మూడెకరాల పొలంలో ట్రాక్టర్ మిషన్ తో వరి నారు నాటించారు. ఈ అధునాతన పరికరాలను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించడంతో పాటు యంత్ర పరికరాలను సబ్సిడీపై అందజేయాలని పలువురు కోరుతున్నారు.

ఆధునికయంత్ర పరికరంతో కరిగెట దున్నుతున్న రైతు