సారథి, సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే సీటీ స్కాన్ వైద్యపరీక్షలు చేయనున్నారు. జిల్లా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఇటీవలే సందర్శించి సీటీస్కాన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందనున్నారు. సుమారు రూ.2.2 కోట్ల వ్యయంతో ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. ఈ పరికరం పదిరోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్‌రావు తదితరులు ఉన్నారు.
- July 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ctscan
- MINISTER KTR
- SIRICILLA
- మంత్రి కేటీఆర్
- సిరిసిల్ల
- సీటీ స్కాన్
- Comments Off on సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలు