హైదరాబాద్: కరోనా కేసులు తుగ్గుముఖం పట్టడంతో కేంద్రప్రభుత్వం కొన్ని ఆంక్షలను సడలించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చింది. జనవరి 31వ తేదీ నాటికి గతంలో విధించిన నిబంధనల గడువు ముగియనుంది. కేంద్ర హోంశాఖ బుధవారం కొత్త నిబంధనలు విడుదల చేసింది. ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, థియేటర్లు గరిష్ట సీటింగ్ సామర్థ్యంతో ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు వీటిని 50 శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతిచ్చారు. తాజాగా ఫుల్ పర్మిషన్ ఇచ్చారు.
- January 27, 2021
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- COVID19
- HOME MINISTRY
- కరోనా
- కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్
- కోవిడ్19
- Comments Off on కరోనా.. ఆంక్షల సడలింపు