సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామశివారులో నూతనంగా ఏర్పాటుకానున్న ఓ కంపెనీకి ప్రభుత్వ అసైన్మెంట్ భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భారతీయ కిసాన్‌మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కామారం గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపి రాత్రికిరాత్రే మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత వ్యక్తులతో పాటు కంపెనీ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సురేష్ గౌడ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, దశరథ్, నరేందర్ రెడ్డి, యువమోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి స్వామి, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
- February 12, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHINNASHANKARAMPET
- KAMARAM
- KISANMORCHA
- medak
- కామారం
- కిసాన్‌మోర్చా
- చిన్నశంకరంపేట
- మెదక్
- Comments Off on మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు