సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్యసమావేశం చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. వీటిలో రైతు విశ్రాంతి భవన నిర్మాణం, ప్రహరీపై పెయింటింగ్, పాత షెడ్ రిపేర్ చేయడం వంటి పలు అంశాలు చర్చించి వాటిని యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాలని తీర్మానించారు. అనంతరం హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, రాగం లచ్చయ్య, పైండ్ల శ్రీనివాస్, అజీజ్, గంగాచారి, మల్లేశం, స్వామి రాయుడు, సెక్రటరీ మల్లేశం మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.
- June 23, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- karimanagar
- RAMADUGU
- కరీంనగర్
- మార్కెట్‌కమిటీ
- రామడుగు
- Comments Off on అభివృద్ధి పనులకు శ్రీకారం