సారథి న్యూస్, బిజినేపల్లి: ఈనెల 12న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆదివారం బిజినేపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ మండల జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర తొలి పీఆర్సీ సిఫార్సుల ప్రకారం రూ.19వేల జీతం ఇవ్వాలని కోరారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దుచేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, రూ.రెండు లక్షల బీమాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సిబ్బంది రామకృష్ణ, స్వామిరెడ్డి, శంకర్, రామేశ్వరమ్మ, వెంకటయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
- February 7, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CITU
- CM KCR
- NAGARKURNOOL
- PANCHAYATHI WORKERS
- గ్రామపంచాయతీ వర్కర్స్
- నాగర్కర్నూల్
- పీఆర్సీ
- సీఎం కేసీఆర్
- సీఐటీయూ
- Comments Off on 12న కలెక్టరేట్ ముట్టడి