- మహాకుంభ సంప్రోక్షణపై చర్చ
- యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచన
సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మై హోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్ కు ఆశ్రమ రుత్విక్కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, చినజీయర్ స్వామి సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. మార్చి 21నుంచి మహాసుదర్శన యాగం, మార్చి 28 మహాకుంభ సంప్రోక్షణ, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ తదితర క్రతువులు, ఆహ్వానాలు ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ చర్చించారు. చినజీయర్ స్వామి సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నారు. ఆశ్రమ సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడి యాగశాలను కూడా పరిశీలించారు. యాగశాల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి వివరాలు తెలిపారు.
యాగానికి అన్ని సౌలత్లు
ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో సీఎం కేసీఆర్ఫోన్లో మాట్లాడారు. యాగం సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. మిషన్ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. యాగశాల వద్ద ఫైరింజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. యాగానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వసతి, మెరుగైన సేవలందించేందుకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. సమతామూర్తి విగ్రహాన్ని సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆశ్రమ రుత్వికులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమంలోని యాగశాలకు వెళ్లారు. అక్కడ చేసిన ఏర్పాట్లపై చినజీయర్ స్వామి వివరించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, మైంహోం అధినేత రామేశ్వరరావు ఉన్నారు.