సారథి, వడ్డేపల్లి(మానవపాడు): సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్ చైర్మన్ కరుణసూరి, ఎంపీపీ రజిత రాజు, జడ్పీటీసీ కాశపోగు రాజు కొనియాడారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం ఆయన చిత్రపటానికి వడ్డేపల్లి మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల ఎంపర్ మెంట్ స్కీం ద్వారా రూ.1000కోట్లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఒక్కో పేద దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున వారి ఖాతాలో జమచేసే కార్యక్రమాన్ని త్వరలోనే కార్యరూపం దాల్చనుందని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్నాయకులు మత్తయ్య, ప్రకాశ్, తనగల మహేందర్, దస్తగిరి, పవన్, ఆదాం, లక్కీ, షాలేమ్ తదితరులు పాల్గొన్నారు.
- June 30, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- dalithempowerment
- GADWALA
- గద్వాల
- దళిత ఎంపవర్ మెంట్
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి