Breaking News

సీఎం కేసీఆర్ హస్తినబాట

సీఎం కేసీఆర్ హస్తినబాట

 ఢిల్లీకి చేరిన సీఎం కేసీఆర్‌

 ప్రధాని మోడీని కలిసే అవకాశం

సామాజిక సారథి, హైదరాబాద్‌ ప్రతినిధి: సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్, సీఎం సోమేశ్​కుమార్ ​ఉన్నారు. మూడు నాలుగు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. వరి ధాన్యం ఎంత మేరకు కొంటారో వార్షిక లక్ష్యం చెబితేనే రాష్ట్ర రైతాంగానికి మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్రం స్పందన మేరకు యాసంగి పంటలపై సీఎం కేసీఆర్ ​స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన సమస్యలను ప్రధాని మోడీకి వివరించనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకుంటామని ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటాలు తేల్చాలని ఆయన డిమాండ్ ​చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో నీటివాటా, బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు. గిరిజన విశ్వవిద్యాలయం తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.