హైదరాబాద్: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించినందుకు వారిని ఆయన అభినందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్లు సుధీర్ కుమార్, పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, అరూరీ రమేష్, తాటికొండ రాజయ్య, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.
- March 22, 2021
- Archive
- CM KCR
- GRADUATES
- MLC ELECTIONS
- TELANGANA
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- తెలంగాణ
- పట్టభద్రులు
- సీఎం కేసీఆర్
- Comments Off on మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం అభినందనలు