సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీచేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్చంద్రశేఖర్ గౌడ్, ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ దామోదర్ రావు, మండల రైతుబంధు కన్వీనర్ రవిందర్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, జిల్లా రైతుబంధు సభ్యుడు బాలముకుందాం, ఆత్మ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ లు ఎల్లా గంగానర్సు రాజన్న, బోనగిరి నారాయణ, సత్తెమ్మ గంగారాం, రాజమణి గంగాధర్, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్, రైతుబంధు సమితి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
- July 29, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM RELIEFFUND
- JAGITYALA
- mla sanjay
- ఎమ్మెల్యే సంజయ్
- జగిత్యాల
- సీఎం సహాయనిధి
- Comments Off on సీఎం సహాయనిధి చెక్కు అందజేత