సారథి న్యూస్, యాచారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి గెలువుకోసం విశేషంగా కృషిచేయాలని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కృష్ణాజలాల సాధనకు సీపీఎంతో కలిసి పోరాడి సాధించామని గుర్తుచేశారు. జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- March 9, 2021
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- CHINNAREDDY
- CONGRESS
- MLC ELECTIONS
- ఇబ్రహీంపట్నం
- కాంగ్రెస్
- చిన్నారెడ్డి
- మల్రెడ్డి రంగారెడ్డి
- Comments Off on చిన్నారెడ్డి గెలుపు ఖాయం