సారథి న్యూస్, మానవపాడు: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీమంత్రి, జి.చిన్నారెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ యూత్ యువ నాయకుడు వేల్పుల రవి కోరారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి జరగాలంటే ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు జి.చిన్నారెడ్డికి వేయాలని కోరారు. కార్యక్రమంలో వేల్పుల రవి, మురళిగౌడ్, నేతాజీ గౌడ్, మాజీ సర్పంచ్ సుంకన్న, పరమేశ్ పాల్గొన్నారు.
- March 8, 2021
- Archive
- పొలిటికల్
- షార్ట్ న్యూస్
- CHINNAREDDY
- CONGRESS
- MLC ELECTIONS
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- చిన్నారెడ్డి
- తెలంగాణ
- Comments Off on చిన్నారెడ్డి గెలుపునకు కృషిచేయాలి