Breaking News

చారిటీ పేరుతో చిల్లర పని

చారిటీ పేరుతో చిల్లర పని

  • రేకుల షెడ్​కు కౌన్సిల్ ద్వారా డబ్బులు డ్రా చేసే యత్నం
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సేవ పేరుతో ఓ కౌన్సిలర్ ​నిర్వాకం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రజలకు కష్టకాలంలో తోడు నిలుస్తానని చెప్పాడు. మైనారిటీ వర్గానికి తాను అందరికీ పెద్దదిక్కులా ఉంటూ సదరు సామాజికవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని నమ్మించాడు. కరోనా కష్టకాలంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తమ తండ్రి పేర ముస్లింల కోసం ఓ గదిని నిర్మిస్తున్నానని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసుకున్నాడు. తీరా ఆ బిల్డింగ్​కు మున్సిపాలిటీ నుంచి డబ్బులు డ్రా చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించాడు. ఇదీ నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలోని ఓ కౌన్సిలర్ ​తతంగం. నాగర్​కర్నూల్ ​మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్ ​చారిటీ పేరుతో బిల్డింగ్​ నిర్మించాడు. తద్వారా పేద ముస్లింలకు సేవ పేరుతో నమ్మించాడు. సదరు కౌన్సిలర్ నిర్మించిన బిల్డింగ్ తన వార్డు పరిధిలోకి రాకపోవడంతో బిల్డింగ్ నిర్మించిన స్థలం పరిధిలోని వార్డు కౌన్సిలర్ తనకు తెలియకుండా తన వార్డులో బిల్డింగ్ ఎప్పుడు నిర్మించారని ఇందుకు సంబంధించిన టెండర్ వివరాలు ఎప్పుడు పబ్లిక్ అయ్యాయని ఆరాతీయడం మొదలుపెట్టాడు. తీరా చారిటీ కింద నిర్మించిన బిల్డింగ్ కు సదరు మైనారిటీ కౌన్సిలర్ ప్రస్తుతం డబ్బులు డ్రా చేసుకునేందుకు చేస్తున్నాడని తెలిసి ఆయన కౌన్సిల్ ​సమావేశంలో అభ్యంతరం చెప్పాడు. ఈ విషయం బయటకు తెలియడంతో ముస్లిం మార్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. అప్పట్లో తండ్రి పేరు మీద చారిటీ కింద నిర్మించిన ఈ భవనానికి ప్రస్తుతం డబ్బులు డ్రా చేయడం ఏమిటని మున్సిపల్ ద్వారా నేరుగా నిధులు వచ్చి ఉంటే రూ.30లక్షలతో అత్యంత అద్భుతంగా భవనం నిర్మాణం జరిగి ఉండేదని ప్రస్తుతం రేకులతో నిర్మించిన చిన్నపాటి రూముకు మూడు లక్షల రూపాయల నిధులు డ్రా చేయడానికి ప్రయత్నించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నాగర్ కర్నూల్ లో అధికారంలో ఉన్న నాయకులకు ఏదైనా సాధ్యమని పలువురు నాయకులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.