సారథి న్యూస్, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామానికి చెందిన గరగ నారాయణమ్మ సంవత్సరికం సందర్భంగా గరగ సురేష్, కుమార్ రాజు, సతీమణి ఇందు, కుమార్తె ముకుందప్రియ, బంధువులు కుమారి, బాలు తదితరులు స్థానిక గ్రేస్ హోమ్ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేశారు. అక్కడి వృద్ధులకు వారి కుమార్తె ముకుందప్రియ అన్నదానం చేశారు. గ్రేస్ హోమ్ నిర్వాహకురాలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు రామినేని రాజేంద్రప్రసాద్, పోస్ట్ మాస్టర్ బెజ్జంకి నారాయణ, బొగ్గుల పుష్ప, కారం రాజు పాల్గొన్నారు.
- March 4, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- GRACEHOME
- MULUGU
- PATHRAPURAM
- గ్రేస్హోమ్
- పాత్రాపురం
- ములుగు
- Comments Off on గ్రేస్ హోమ్లో అన్నదానం