సారథి న్యూస్, ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల డ్యూటీని తమకు కేటాయించిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి రమాదేవి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. విధుల పట్ల ఏవైనా అనుమానాలు తలెత్తితే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మార్చి 2న పీవో, ఏపీవోలకు మొదటి విడత, 9న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ లో ఓటర్ల సంఖ్యను బట్టి బ్యాలెట్ బాక్సులను కేటాయించనున్నట్లు వివరించారు. ఎన్నికల విధులకు ప్రాధాన్యమిస్తూ జాబ్ చార్ట్ ప్రకారం ఎన్నికల విధులు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జడ్పీ సీఈవో ప్రసూన రాణి, డీపీవో వెంకయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీసీవో విజయ్ భాస్కర్, ములుగు తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఏవో శ్యాం సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- February 25, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MLC ELECTIONS
- MULUGU
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- జిల్లా రెవెన్యూ ఆఫీసర్
- ములుగు
- Comments Off on ఎన్నికల డ్యూటీని జాగ్రత్తగా నిర్వర్తించాలే