సామాజిక సారథి , బిజినేపల్లి: బి ఆర్ ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి అన్ని డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు . బిజినేపల్లి లో గ్రామ పంచాయతీ సమ్మెకు మద్దతుగా బుధవారం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మె కార్యక్రమంలో భాగంగా సమ్మెకు మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కరోనా సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసేటటువంటి మొదటి వ్యక్తి అని కొనియాడారు వీరి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం త్వరగా నెరవేర్చాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ స్వామి , మధు సుధన్ రెడ్డి , తిరుపతయ్య , అమురుత్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు .
- July 12, 2023
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on బిఆర్ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి …డాక్టర్ .రాజేష్ రెడ్డి