సారథి న్యూస్, బిజినేపల్లి: స్థానికంగా సరైన వసతులు లేవనే కారణంతో వనపర్తి, షాద్‌నగర్ లో కొనసాగుతున్న బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల, నాగర్ కర్నూల్ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఇదివరకు ఉన్న ప్రదేశాల్లోనే కొనసాగించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంవో సెక్రటరీ కె.భూపాల్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకు సరిపడా గదులు, వసతి సౌకర్యం లేదని గతేడాది బిజినేపల్లి స్కూలును వనపర్తికి, నాగర్‌కర్నూల్ మహిళా డిగ్రీ కాలేజీని షాద్‌నగర్‌కు తరలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఆ రెండు విద్యాసంస్థలను వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తీసుకున్న చొరవ పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్క్షతలు తెలిపారు. పేరెంట్స్అసోసియేషన్రాష్ట్ర కమిటీ సభ్యుడు మొల్గర మహేందర్, జిల్లా కార్యదర్శి ఎల్.వెంకట్, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్తదితరులు అభినందనలు తెలిపారు.
- February 1, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CM KCR
- RS PRAVEEN KUMAR
- tswries gurukula
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- గురుకులాలు
- నాగర్‌కర్నూల్
- బిజినేపల్లి
- సీఎం కేసీఆర్
- Comments Off on ఆ రెండు గురుకులాలను వెనక్కి తీసుకురండి