- మహబూబాబాద్ సిటీలో సుపారి గ్యాంగ్స్ హల్చల్
- సీసీ కెమెరాల నిఘా అవసరం అంటున్న ప్రజలు?
సామాజిక సారథి , మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో రెండు సుపారి గ్యాంగ్స్ పట్టణానికి చెందిన బోళ్ల రాకేష్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు తెగబడి విఫలమై పోలీసులకు చిక్కారు. ఖమ్మం పట్టణంకు చెందిన కొడకండ్ల సురేష్ ఎ.ఎన్.ఎక్స్(సిటీ కేబుల్) అనే వ్యక్తి మహబూబాబాద్ కు చెందినబోళ్ల రాకేష్ రెడ్డిని రెండు వాహనాల్లో సుమారు 10 మంది కిరాయి గుండాలతో కలిసి వచ్చి మహబూబాబాద్ లోని కురవి రోడ్డులోని స్థానిక జర్నలిస్ట్ కాలనీ సమీపంలో కిడ్నాప్ చేసి ప్రయత్నం చేయగా, రాకేష్ అనుచరులు ఖమ్మం సఫారీ గ్యాంగ్స్ ను పట్టుకుని ఆయా వ్యక్తులను, వారు ఉపయోగించిన వాహనాలను మహబూబాబాద్ పట్టణ ఎస్.ఐ రామదేవికి అప్పగించారు. ఈ గ్యాంగ్ రాకేష్ రెడ్డిని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో..? స్థానికులు ఎవరి హస్తం ఉందొ..? ఎవరు ఎందుకు ఈ కిడ్నాప్ కి ఎవరు సహరిస్తున్నారో, తెలియాలి. ఈ సంఘటనపై లోతుగా విచారించేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కేంద్రం అయినా పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయక పోవడంతో ప్రజలకు భద్రత లేకుండా పోయింది. అ సాంఘిక శక్తుల వివరాలు మీకు ముందస్తుగా పోలీసుల వద్ద ఉంటే భవిష్యత్తులో జరుగబోయే ఇటువంటి సంఘటనలు జరుగకుండా ఉంటాయని నేర పరిశోధన నిపుణులు అంటున్నారు.