సారథి, రామడుగు: చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ మండల స్థాయి శిక్షణ తరగతులు దేశరాజుపల్లి గ్రామంలోని జయశ్రీ గార్డెన్ శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులకు బీజేపీ జిల్లా స్థాయి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ హాజరయ్యారు. బీజేపీ ఆవిర్భావం, వికాసం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి కార్యకర్తలకు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మేకల ప్రభకర్ యాదవ్, మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి, జిన్నారం విద్యాసాగర్, పొన్నం శ్రీను, ఉప్పు రాంకిషన్, యువమోర్చా నాయకులు దురుశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- April 5, 2021
- Archive
- BJP
- bodoge shoba
- CHOPPADANDI
- PRIME MINISTER MODI
- చొప్పదండి
- ప్రధాని మోడీ
- బీజేపీ
- బొడిగే శోభ
- Comments Off on బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం