Breaking News

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్


సారథి ప్రతినిధి, రామగుండం: కరోనా విజృంభిస్తున్న వేళ గోదావరిఖనిలోని గల్లీగల్లీల్లో పోలీసులు సోమవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించారు. గాంధీచౌరస్తా నుంచి సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పనీపాట లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనాలను సీజ్ చేసి, వారిని ఐసొలేషన్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారికి కౌన్సిలింగ్ చేసి కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పెట్రోలింగ్ లో వన్ టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ఉమాసాగర్, రమేష్, సతీష్, కానిస్టేబుల్స్, డిస్ట్రిక్ గార్డ్స్ పాల్గొన్నారు.