Breaking News

నల్లవాగులో భూబకాసురులు

నల్లవాగులో భూబకాసురులు

  • సర్వేనెంబర్ 117 ప్రభుత్వ భూమి కబ్జా
  • రాత్రికిరాత్రే వెలిసిన ఇండ్లు, నిర్మాణాలు
  • ఫిర్యాదుచేసినా పట్టించుకోని కలెక్టర్​, డీపీవో

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: అసలే ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. భూములకు బాగా డిమాండ్​ పెరిగింది. ఇంకేముంది సమీపంలో ఉన్న నల్లవాగు చుట్టు ఉన్న భూములపై భూబకాసురులు కన్నేశారు. అప్పనంగా అక్రమించేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి సర్వేనం.117లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. కొందరు భూ బకాసురులు ఐదో పదో ఇచ్చి అమాయక దళితుల చేత బాండ్​ పేపర్లపై రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆ భూములకు విలువ పెరిగింది. దీంతో అక్రమార్కులు రాత్రికిరాత్రే రాళ్లు పాతి పాట్లు చేసి అమ్మకానికి పెట్టారు. మెడికల్ కాలేజీ నిర్మాణం చేసినప్పటి నుంచి దళారులు నల్లవాగు చుట్టే తిరుగుతూ దళితుల భూములను కజ్జా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నా కనీసం ఆ వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరుపై పలు అనుమానాలు తావిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నిర్మాణాలు కూడా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఫిర్యాదులుచేసినా కలెక్టర్​, ఇతర రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నల్లవాగు భూములు