సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో జానపద, పౌరాణిక నాటక భజన కళాబృందం కళాకారులు కేక్ కట్చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా కష్టకాలంలో కళాకారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ కష్టాలు ఇక తొలగిపోయినట్టేనని పేర్కొన్నారు. జానపద, పౌరాణిక నాటక రంగాన్ని కాపాడుతున్న కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాక్షేత్రాలు, సినిమా థియేటర్లను ఓపెన్ చేయడంతో కళాకారులకు మంచిరోజులు వచ్చాయని అన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు ప్రభావం చూపుతున్న నేటి తరుణంలో పౌరాణిక నాటక రంగానికి మంచి ఆదరణ ఉందని తెలిపారు. వచ్చే శివరాత్రి, ఉగాది పర్వదినాలకు కొట్ర గ్రామంలో నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అంతకుముందు పౌరాణిక నాటకం పంతులు కొప్పు మొగులయ్యకు కేక్కట్చేసి తినిపించారు. కార్యక్రమంలో బైరంపోగు బాల్రాం, భూత్కూరి నర్సింహా, కొప్పు వెంకటయ్య(అయ్యగారు), కొప్పు వెంకటయ్య(లడ్డూ), తుడుముల వెంకటయ్య, కొప్పు వెంకటయ్య(క్రాంత్), ముంగల్శెట్టి కృష్ణయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
- January 15, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KOTRA
- SANKRANTHI
- STAGE PROGRAMMS
- కరోనా
- కొట్ర
- భజన కళాబృందం
- సంక్రాంతి సంబరాలు
- Comments Off on కొట్రలో భజన కళాబృందం సంబరాలు