సారథి న్యూస్, వాజేడు: క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా ములుగు కలెక్టరేట్ లో కలెక్టర్ కృష్ణ ఆదిత్య పలువురు వైద్యసిబ్బందిని సత్కరించారు. పీవో హన్మంత్ జెండగే, డిప్యూటీ కలెక్టర్ ఆదర్శ్ శురభి, డీఎంహెచ్వో అప్పయ్య, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ చేతులమీదుగా వైద్యులు, సిబ్బందిని సన్మానించి ప్రశంసపత్రాలు అందజేశారు. వాజేడు ప్రభుత్వ హాస్పిటల్ పరిధిలో క్షయ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి వారికి మందులు పంపిణీ చేసినందుకు హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, పేరూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉత్తమ ఆరోగ్య కార్యకర్త కుంజా తిరుపతిరావు ఉత్తమ అవార్డు అందుకున్నారు.
- March 26, 2021
- Archive
- MULUGU
- Tb desease
- VAJEDU
- క్షయ వ్యాధి
- ములుగు
- వాజేడు
- Comments Off on క్షయ నిర్మూలనలో ఉత్తమ సేవలు