సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుర్రం సమరసింహరెడ్డి, కొలిమికుంట ఎంపీటీసీ తోట కోటేశ్పటేల్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు దాడి సురేష్, రవి, నార్ల ఆదిత్య, దాసరి వంశీ, రాజు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- July 9, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJYM
- CHOPPADANDI
- CM KCR
- చొప్పదండి
- బీజేవైఎం
- సీఎం కేసీఆర్
- Comments Off on బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన