సామాజిక సారథి, జహీరాబాద్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శంకర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జహీరాబాద్, మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆన్ లైన్ లో సైబర్ సెక్యూరిటీ, ఆన్ లైన్ నేరాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఫిష్ క్యాచింగ్, లాటరీ స్కాం వంటి అంశాలపై 6 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ రూరల్ ఎస్సై రవిగౌడ్, చిరాక్ పల్లి ఎస్సై కాశినాథ్, ప్రధానోపాధ్యాయురాలు హుగ్గేల్లి అరతి, పలుపాఠశాలల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
- November 24, 2021
- Archive
- లోకల్ న్యూస్
- ALERT
- CRIME
- CYBER
- POLICE
- ZAHEERABAD
- అలర్ట్
- జహిరబాద్
- నేరాల
- పోలీసులు
- సైబర్
- Comments Off on సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి