Breaking News

పల్లెప్రగతిలో భాగస్వాములుకండి

పల్లెప్రగతిలో భాగస్వాములుకండి

సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా చూడాలన్నారు. గ్రామాల్లో మురికినీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సంధ్యారాణి, డిప్యూటీ సీఈవో నరేష్, పంచాయతీరాజ్, మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.