సామాజిక సారథి, నల్లగొండ: హైదరాబాద్ లోని తార్నాకలో సెయింట్ ఆన్స్ జనరేట్ కేంద్రంలో నిర్వహించనున్న బీసీ యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆ సదస్సు ప్రతినిధులు డా.బాల శ్రీనివాస్, అంకం జయప్రకాష్, నక్కా నర్సింహ యాదవ్ కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనా సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27,28 వ తేదీలలో నిర్వహిచే దస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీని కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రంమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్, జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- November 23, 2021
- Top News
- BC
- MEETING
- NALLAGONDA
- Successful
- నల్లగొండ
- బీసీ
- మీటింగ్
- విజయవంతం
- Comments Off on బీసీ సదస్సును విజయవంతం చేయాలి