సారథి, మానవపాడు: వచ్చే బక్రీద్, వినాయక చవితి పండుగలను ఎవరికి ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ సూచించారు. ఆదివారం మానవపాడు పోలీస్స్టేషన్ ఆవరణలో ముస్లిం పెద్దలు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులతో శాంతిసమావేశం నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా అందరం కలిసి పండుగలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా ప్రార్థన స్థలాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని సూచించారు. అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు, వారి కదలికలపై నిఘా పెడతామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం ఎక్కడ పడితే అక్కడ తాగితే చర్యలు తప్పవన్నారు. గ్రామస్తులు సహకారం ఉండాలని సూచించారు. ప్రతి వ్యాపార దుకాణం ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
- July 18, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BAKRID
- GADWALA
- VINAYAKACHAVITHI
- గద్వాల
- బక్రీద్
- వినాయక చవితి
- Comments Off on శాంతియుతంగా బక్రీద్